![]() |
![]() |

"నీతో డాన్స్" ఈ వారం ఎపిసోడ్ లో టీం బిలో రెండు జంటల మధ్య మార్క్స్ విషయంలో కొన్ని క్లాషెస్ వచ్చాయి. ఆట సందీప్-జ్యోతి చేసిన డాన్స్ కి 8 మార్క్స్ ఇచ్చారు అమరదీప్-తేజు జంట. ఆ తర్వాత ప్రియాంక-శివ్ ఇద్దరూ చేసిన పెర్ఫామెన్స్ కి కూడా 8 మార్క్స్ ఇచ్చారు..దీపా-సాగర్ మాత్రం 6 మార్క్స్ ఇచ్చారు. సందీప్-జ్యోతి జంట కూడా 6 మార్క్స్ ఇచ్చారు. ఇక శివ్ డాన్స్ మీద సందీప్ మాట్లాడాడు. "శివ్ నీ డాన్స్ నాకు నచ్చలేదు. ఇదంతా మీ కొరియోగ్రాఫర్ దే తప్పు. స్టేజి మీద ఎప్పుడు పెర్ఫార్మ్ చేసినా కూడా గర్ల్స్ , బాయ్స్ అలా పరిగెత్తుకుని రాకూడదు ..కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీరు బాగా చేయగలరు..నేను ఇలా చేయొచ్చో లేదో తెలీదు...నేను గనక కొరియోగ్రాఫ్ చేస్తే చింపి చాట చేస్తాను..ప్రతీ సాంగ్ కి డిఫరెన్స్ అనేది చూపించాలి.
అంతా బాగా చేశారు కానీ యాక్ట్ లో కొంచెం మిస్ అవుతోంది" అని చెప్పాడు. ఇక తర్వాత అమరదీప్ ని ఒక ప్రశ్న అడిగింది జ్యోతి. "మా పెర్ఫార్మెన్స్ కి ప్రియాంక - శివ్ పెర్ఫార్మెన్స్ కి 8 మార్క్స్ ఇచ్చావ్..రెండూ సమానంగా అనిపించాయా" అని అడిగింది. "తప్పులు ఉన్నా కూడా సాంగ్ నచ్చి ఒక మార్క్ ఇచ్చాను" అని చెప్పాడు అమరదీప్.."మనస్ఫూర్తిగా చెప్పు" అని సందీప్ అడిగేసరికి "నేను చెప్తాను..మీరు ఆల్రెడీ కొరియోగ్రాఫర్" అని శివ్ చెప్పబోతుండగా "ఆ మాట అనొద్దు..అందరం ఒకే సీట్స్ లో కూర్చుంటున్నాం..ఒకే ఫ్లోర్ మీద డాన్స్ చేస్తున్నాం..నాకు రెండు కాళ్లకు ఆపరేషన్ అయ్యింది. లిగమెంట్ ఉంది..ఐనా కూడా డాన్స్ చేయడాన్ని ప్రేమిస్తాను ..కాళ్ళు విరిగిపోయినా కూడా ఇక్కడే డాన్స్ చేస్తా ..మళ్ళీ ఈ మాట నాకు..మనమంతా ఇక్కడ ఈక్వల్ ..మీరు బాగా చేస్తున్నారు. కానీ మీకు తగ్గట్టు మీ కొరియోగ్రాఫర్ చెయ్యట్లేదు అనేదే నా బాధ" అని చెప్పాడు. ఎలిమినేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మార్క్స్ ఇవ్వండి అని చెప్పింది శ్రీముఖి.
![]() |
![]() |